డీఆర్‌డీఓలో 105 అప్రెంటిస్‌ ఖాళీలు

బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE) వివిధ విభాగాల్లో 105 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ఐటీఐ అప్రెంటిస్ ఉద్యోగాలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 నుంచి రూ.12,300 వరకు స్టైపెండ్ అందిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబరు 15, 16 తేదీల్లో బెంగళూరులోని సీవీ రామన్‌ నగర్‌లో నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావచ్చు. శిక్షణ కాలం ఏడాది పాటు ఉంటుంది.

సంబంధిత పోస్ట్

✕
✕