తెలంగాణలో ఈ ఏడాది ఇంజినీరింగ్ సీట్ల మొత్తం సంఖ్యను ఉన్నత విద్యామండలి ఆదివారం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,07,218 సీట్లు ఉన్నట్లు పేర్కొంది. ఈ సీట్లలో 70 శాతం అంటే 76,795 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.