AP: నిరుద్యోగులకు శుభవార్త. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 1,092 నాన్-టీచింగ్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. టెండర్ల ద్వారా థర్డ్ పార్టీ సంస్థను ఎంపిక చేసి ఈ నియామకాలు చేపట్టనున్నారు. టెండర్లకు రేపటి వరకు గడువు విధించారు. ఎంపికైన సంస్థ సిబ్బందికి జీతం, పీఎఫ్ చెల్లిస్తుంది, ఆ మొత్తాన్ని సమగ్ర శిక్షా సంస్థ భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలకు రూ.12 వేల నుండి రూ.18 వేల వరకు జీతం ఉంటుంది.