సూడాన్‌లో బంగారు గని కూలి 11 మంది మృతి

సూడాన్‌లోని రెడ్‌ సీ రాష్ట్రంలో ఆదివారం బంగారు గని షాఫ్ట్‌ కూలిన ఘటనలో 11 మంది కార్మికులు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానించడంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన ఈశాన్య సూడాన్‌లోని మారుమూల ఓని ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇటీవల పశ్చిమ సూడాన్‌లో గని కూలిన ఘటనలో కనీసం 82 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్

✕
✕