11 ఏళ్ల దాంపత్య జీవితం..ఉల్లిపాయ, వెల్లుల్లి కారణంగా విడాకులు

అహ్మదాబాద్‌లో 11 ఏళ్ల దాంపత్య జీవితం ఉల్లిపాయ–వెల్లుల్లి వివాదంతో విచ్ఛిన్నం అయింది. స్వామినారాయణ భక్తురాలైన భార్య ఉల్లి, వెళ్లుల్లి తినకపోవడంతో భర్త, అత్తగారితో వంటల దగ్గర వచ్చిన భేదాభిప్రాయాలు కలహాలకు దారితీశాయి. విడిగా వంట, పెరుగుతున్న గొడవలతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. 2013లో భర్త విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా, 2024లో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే ఆ తరువాత భార్య హైకోర్టులో సవాలు చేయగా.. తాజాగా హైకోర్టు భార్య పిటిషన్‌ను కొట్టివేసి విడాకులను సమర్థించింది.

సంబంధిత పోస్ట్