కారులో తరలిస్తున్న 110 వెండి బిస్కెట్లు సీజ్ (వీడియో)

కారులో తరలిస్తున్న 110 వెండి బిస్కట్లను ఒడిశా ఆబ్కారీ అధికారులు గురువారం సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ కారును రెంగాలి తహశీల్దార్ కార్యాలయం సమీపంలో అధికారులు తనిఖీ చేశారు. కారు సీక్రెట్ అరలో వెండి బిస్కట్లను గుర్తించారు. వెండిని ముంబై నుంచి రాంచీకి తరలిస్తున్నట్లు జిల్లా ఆబ్కారీ సూపరింటెండెంట్‌ అసిత్‌ మల్లిక్‌ తెలిపారు. ఒక్కో బిస్కట్‌ కిలో ఉందని, విలువ రూ.1,10 కోట్లు ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్