స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా 1146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ లేదా MBA/PGDM అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి పోస్టును బట్టి మారుతుంది. ఎంపిక ప్రక్రియలో అనుభవం, నైపుణ్యాలు, ఇంటర్వ్యూలకు ప్రాధాన్యత ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు నేడే చివరి రోజు. పూర్తి వివరాలకు https://sbi.bank.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.