తమిళనాడుకు చెందిన 116 ఏళ్ల భక్తురాలు నవనీతమ్మకు తిరుమలలో శ్రీవారి దివ్య దర్శనం లభించింది. వయసు ఎక్కువైనా ఆమె కాలినడకన కొండ ఎక్కి వచ్చిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో టీటీడీ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఉదయం ఆమెను ప్రత్యేకంగా ఆలయానికి తీసుకెళ్లి దర్శనం చేయించారు. కాగా, CM చంద్రబాబు, TTD ఛైర్మన్ ఆమె భక్తిని కొనియాడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, సాధారణ భక్తులకు సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుండగా, 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.