ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో సీనియర్ మావోయిస్ట్, కేంద్ర కమిటీ సభ్యుడు రామ్‌ధేర్‌మజ్జీ సహా 12 మంది మావోయిస్టులు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అరుణ్ దేవ్ గౌతమ్ ముందు లొంగిపోయారు. వీరి వద్ద మూడు AK-47, ఒక SLR, మూడు INSAS, రెండు 303 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్ల 95 లక్షల రివార్డు ఉన్న ఈ మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.