తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, భక్తుల వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది. నిన్న 68,980 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్