TG: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించుకునేందుకు కేంద్రం ప్రతిపాదించిన కమిటీలో 12 మంది సభ్యులు ఉండేలా ఇరు రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. ఏపీ, టీజీ నుంచి ఐదుగురి చొప్పున, కేంద్రం తరపున ఇద్దరు సభ్యులను నియమించాలన్న ప్రతిపాదనల మేరకు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. సోమవారం నాటికి జాబితాను ఖరారు చేసి కేంద్రానికి పంపనున్నట్లు తెలుస్తోంది.