పహల్గాం దాడి తర్వాత దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా దళాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పలు ఆపరేషన్‌లు చేపట్టాయి. ఈ ఆపరేషన్‌ల ద్వారా 100 రోజుల్లో 12 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లను అంతం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హతమైన 12 మందిలో ఆరుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు కాగా.. మిగతా వారు జమ్మూకశ్మీర్‌లో జరిగిన ప్రధాన ఉగ్రదాడుల్లో పాల్గొన్న స్థానికులు అని నిఘా వర్గాలు తెలిపాయి.