రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) త్వరలో 1200 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 20 నుంచి 30 ఏళ్ల వయస్సు వారు అర్హులని ప్రాథమిక సమాచారం. ఎంపికైన వారికి నెలకు సుమారు రూ.35,400 బేసిక్ వేతనంతో పాటు అలవెన్సులు లభిస్తాయి. అయితే, దరఖాస్తు తేదీలు, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలు అధికారిక ప్రకటనలో తెలియజేయబడతాయి. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం RRB అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించడమైనది.