గాలి నుంచి నీటిని తయారుచేసిన 13 ఏళ్ల బాలుడు!

అమెరికాకు చెందిన 13 ఏళ్ల విద్యార్థి రాయ్ కిమ్ గాలిలోని తేమను గ్రహించి నీరుగా మార్చే వినూత్న పరికరాన్ని రూపొందించాడు. 'పెల్టియర్ మాడ్యూల్', ప్రత్యేక సెన్సార్లతో పనిచేసే ఈ పరికరం గాలిని చల్లబరిచి నీటిగా మార్చి నేరుగా పంటలకు అందిస్తుంది. కరవు ప్రాంతాల వ్యవసాయానికి ఉపయోగపడే ఈ ఆవిష్కరణతో రాయ్ '3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్' టాప్-10 ఫైనలిస్టుగా నిలిచాడు. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో నీటి కొరతను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది.

సంబంధిత పోస్ట్