బ్యాంకింగ్ రంగంలో 13,441 ఉద్యోగాలు.. సెప్టెంబర్ 21 చివరి తేదీ

దేశవ్యాప్తంగా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRB) 13,441 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-I, II, III పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ (IBPS) దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 21వ తేదీ లోపు 'ibps.in' అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్/ఓబీసీ/EWS వర్గాలకు రూ.850, SC/ST/PwBD అభ్యర్థులకు రూ.175గా దరఖాస్తు రుసుము నిర్ణయించారు. ప్రిలిమ్స్, మెయిన్స్, స్థానిక భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది.

సంబంధిత పోస్ట్

✕
✕