రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRBs) 13,745 క్లర్క్, పీవో (ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-I, II, III) పోస్టుల భర్తీకి IBPS ఆన్లైన్ దరఖాస్తు గడువును సెప్టెంబర్ 27, 2026 వరకు పొడిగించింది. గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ అర్హతగా ఉంది. SC/ST/PwBD అభ్యర్థులకు ₹175, ఇతరులకు ₹850 ఫీజుగా నిర్ణయించారు. ప్రిలిమ్స్ పరీక్షలు 2026 నవంబర్/డిసెంబర్లో జరగనున్నాయి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 27లోపు 'ibps.in' వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.