పాకిస్థాన్‌లోని అదియాలా సెంట్రల్ జైలు నుంచి 14 మంది ఖైదీలు పోలీసుల కళ్లలో కారం చల్లి తప్పించుకున్నారు. రావల్పిండి జిల్లా కోర్టు విచారణ అనంతరం జైలుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనతో రావల్పిండి, ఇస్లామాబాద్ పరిసర ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పారిపోయిన వారిలో నలుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలిన 10 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.