తల్లి మందలించిందని 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య!

TG: నల్గొండ జిల్లా నిడమనూరులో విషాదం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలుడు తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వచ్చి బాలుడు తిరిగి స్కూలుకు వెళ్లకపోవడంతో తల్లి మందలించింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురై బాలుడు ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕