ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో పెళ్లి ఊరేగింపులో భారీ డీజే సౌండ్ ఎఫెక్ట్స్ కారణంగా 140 కోళ్లు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. డీజే శబ్దానికి భయపడి కోళ్లు చనిపోయాయని కోళ్ల ఫారం యజమాని ఆరోపించారు. ఈ ఘటనపై డీజే ఆపరేటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.