140 కేజీల గంజాయి స్వాధీనం

AP: గంజాయి మాఫియాపై అనకాపల్లి పోలీసుల ఉక్కుపాదం మోపారు. సుమారు రూ.70 లక్షల విలువైన 140 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కంటైనర్ లారీలో ఒడిశా నుంచి రాజస్థాన్‌కు గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలో డ్రగ్స్ రవాణా చేస్తే పీడీ యాక్ట్, ఆస్తుల జప్తు తప్పదని ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕