రైతుపై కొండచిలువ దాడి.. ప్రాణాలతో బయటపడిన మహిళ

TG: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో బుధవారం పొలం పనులు చేస్తున్న స్వప్న అనే మహిళా రైతుపై 15 అడుగుల భారీ కొండచిలువ దాడి చేసి మింగేందుకు ప్రయత్నించింది. బాధితురాలి అరుపులు విన్న సహచర రైతులు, కూలీలు వెంటనే స్పందించి కొండచిలువను తరిమికొట్టి ఆమె ప్రాణాలు కాపాడారు. అనంతరం పామును గోనె సంచిలో బంధించి, బాధితురాలితో కలిసి జనగామలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం స్వప్న ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్