సుక్మా జిల్లాలో 15 మంది కీలక మావోయిస్టుల లొంగుబాటు (వీడియో)

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 15 మంది కీలక మావోయిస్టులు జిల్లా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ ఎదుట లొంగిపోయారు. వీరిలో ఐదుగురు మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. వీరిలో పీఎల్‌జీఏ నంబర్‌ వన్‌ బెటాలియన్‌లో చురుగ్గా పనిచేస్తున్న నలుగురు ఉన్నారని, వారిపై మొత్తం రూ.40 లక్షల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా హింసా మార్గాన్ని వీడి లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్