త్వరలోనే టీమిండియాలోకి వైభవ్: మనీష్ ఓజా

15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి త్వరలో అరంగేట్రం చేయనున్నట్లు అతని కోచ్ మనీష్ ఓజా తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఓజా మాట్లాడుతూ వైభవ్ టాలెంట్ అద్భుతమని, ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే అతను భారత జట్టులో ఉంటాడని ధీమా వ్యక్తం చేశారు. అభిషేక్ శర్మ ఆటలో నిలకడ లేకపోవడంతో, వైభవ్ ను సంజూ శాంసన్ లేదా ఇషాన్ కిషన్ లతో కలిసి ఓపెనింగ్ చేయించాలని సూచించారు. భవిష్యత్తులో ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో వైభవ్ ను టీ20 ఫార్మాట్ లో ఆడించాలని బీసీసీఐని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్