త్వరలో 15 వేల అంగన్వాడీ టీచర్ పోస్టులు: మంత్రి సీతక్క

TG: మహబూబాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో త్వరలో 15 వేల అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు. ఐడీఓసీ భవనంలో టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఆమె, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అంగన్వాడీలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్