ఢిల్లీ హైకోర్టులో 152 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఢిల్లీ హైకోర్టు 152 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణలకు ఫిబ్రవరి 27 వరకు అవకాశం ఉంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి, రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ (డిస్క్రిప్టివ్) పరీక్ష, టైప్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు రుసుము 500 రూపాయలు, SC, ST, PwBD అభ్యర్థులకు 1300 రూపాయలు. మరిన్ని వివరాలకు delhihighcourt.nic.in ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్