తెలంగాణలో మొదటిరోజు 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ

TG: రాష్ట్రంలో నాలుగు ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకాలకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొదటిరోజు 15,414 కొత్త రేషన్ కార్డులు జారీచేసింది. దీంతో కొత్త కార్డుల్లోని 51,912 మందికి ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ చేయనుంది. తొలిరోజు మండలానికొక గ్రామంలో ఈ రేషన్ కార్డులను జారీ చేసింది. పాత రేషన్ కార్డుల్లో అదనంగా 1.03 లక్షల మంది పేర్లను చేర్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్