జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాల్లో మొత్తం 15,762 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువు రేపటితో ముగియనుంది. కేంద్రీయ విద్యాలయాల్లో 9,921, జవహర్ నవోదయ విద్యాలయాల్లో 5841 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించినందున, ఈసారి గడువు పొడిగించే అవకాశం లేదు. ఆసక్తిగల అభ్యర్థులు https://www.cbse.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.