TG: ఫుడ్ పాయిజన్‌తో 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. వైద్యులు విద్యార్థినులకు చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.