కేరళలోని కొచ్చిలో చెరై-జరక్కల్ రహదారిపై 16 ఏళ్ల బాలుడు టొయోటా కారును నడుపుతూ స్నేహితులతో షికారుకు వెళ్లాడు. రోడ్డు మధ్యలో యూ-టర్న్ తీసుకునే క్రమంలో బైక్‌లను ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లిపోయాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలవగా, మరికొందరు తృటిలో తప్పించుకున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఈ ఘటనపై బాలుడి తండ్రి అబ్దుల్ రషీద్‌పై కేసు నమోదు చేశారు.