తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన 16 ఏళ్ల కొడుకు

AP: కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చాపాడు మండలంలోని ఓబుల్‌రెడ్డి పేటలో మద్యం మత్తులో కన్నతల్లిని వేధిస్తున్నాడనే కోపంతో, 16 ఏళ్ల బాలుడు తన తండ్రిని కత్తితో పొడిచి చంపాడు. నిత్యం మద్యం సేవించి భార్యను వేధించే తండ్రిని చూసి తట్టుకోలేక, ఆవేశంలో కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, మద్యపాన వ్యసనం ఈ హత్యకు కారణాలని ప్రాథమికంగా నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్