సైనిక శిబిరం సమీపంలో 160 డిటోనేటర్లు.. కుట్ర కోణంలో విచారణ

హైదరాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ క్యాంప్ సమీపంలో 160 డిటోనేటర్లు లభించడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆర్మీ క్యాంపుల సమీపంలో ఇంత పెద్ద సంఖ్యలో డిటోనేటర్లు ఎలా వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. అక్రమ రవాణాదారులు పడేసి వెళ్లారా లేక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి డిటోనేటర్లను సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. ఇవి పేలితే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని అంచనా వేసి తక్షణ చర్యలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్