అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడుల్లో ఇరాన్ మినాబ్‌లోని ఓ స్కూల్‌లో 180 మంది మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో 165 మంది బాలికలు ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారులందరినీ ఒకే చోట సమాధి చేయనున్నారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో గోతులు తవ్విన ఫొటోను ఇరాన్ మంత్రి అబ్బాస్ విడుదల చేయగా.. ఆలోచింపజేస్తోంది. ఇక ఇవాళ వారి అంతిమయాత్రలో పెద్దసంఖ్యలో ఇరాన్ ప్రజలు పాల్గొన్నారు.