పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. దుర్గాపూజ సమయానికి తనతో పాటు మరో 17 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు బీజేపీలో చేరనున్నారని కూచ్బెహార్ ఎంపీ జగదీశ్ చంద్ర బర్మా బసునియా తెలిపారు. అనర్హత వేటు పడకుండా చట్టపరమైన చిక్కులు దాటేందుకే వీరంతా ఒకేసారి చేరుతున్నట్లు చెప్పారు. మరో ముగ్గురు మైనారిటీ ఎంపీలు (యూసఫ్ పఠాన్ సహా) బీజేపీలో చేరకుండా బయట నుంచి ఎన్డీయేకు మద్దతిస్తారన్నారు. నిరసనల నేపథ్యంలో తాను ప్రస్తుతం ఎన్డీయే కూటమిలోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.