170 ఎకరాలు.. ప్రైవేటుకు ధారాదత్తం: హరీశ్‌రావు

TG: శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌లో 170 ఎకరాల ప్రభుత్వ భూమిని సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. ఆర్డీవో ఆదేశాలను ధిక్కరించి ఎమ్మార్వో ఆ భూములను అప్పగించారని, ఎమ్మార్వోను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారని ఆయన అన్నారు. ఈ అవినీతిలో ప్రభుత్వానికి సంబంధం లేకుంటే ఎమ్మార్వో ఆర్డర్‌ను సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్