దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద 170 గ్రాముల బంగారాన్ని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా వెళ్తున్న అతన్ని అనుమానంతో ఆపి, లగేజీని తనిఖీ చేయగా ప్లాస్టిక్ బాటిల్ మూత కింద దాచిన బంగారం బయటపడింది. అక్టోబర్ 25వ తేదీన AI-996 విమానంలో ప్రయాణించిన అతన్ని అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.