AP: తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 84,258 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,502 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.90 కోట్లు వచ్చింది.