రూ.2 వేలకు మించిన వాణిజ్య యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలను అక్టోబర్ 15 నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో.. వాటిపై 18 శాతం జీఎస్టీ వర్తించనుంది. 2025-26లో రూ.60 లక్షల కోట్లకుపైగా విలువైన వాణిజ్య యూపీఐ లావాదేవీలు రూ.2 వేలు దాటినవేనని అంచనా. వీటిపై 0.4 శాతం ఎండీఆర్ విధిస్తే సుమారు రూ.24 వేల కోట్లు వసూలయ్యే అవకాశం ఉండగా.. 18 శాతం జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.4,300 కోట్ల ఆదాయం రావచ్చని నిపుణులు చెబుతున్నారు.