ఒక్కసారిగా కుప్పకూలిన 18 అంతస్తుల బిల్డింగ్ (వీడియో)

కెన్యా రాజధాని నైరోబీలోని ఈస్ట్‌లీ ప్రాంతంలో 18 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. నిర్మాణం ఇంకా జరుగుతుండగానే పేకమేడలా కూలిపోయింది. భవనం పైభాగంలో నివాసితులు లేరు. కానీ.. బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎలక్ట్రానిక్స్ షాపులు, ఇతర దుకాణాలు ఉన్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. భవన నిర్మాణం ప్రమాణాలకు అనుగుణంగా లేదని, బిల్డింగ్ ఓనర్‌పై లీగల్ చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕