రూ. 180 కోట్ల విలువైన చెప్పుల జత.. వజ్రాలు, బంగారం, ఉల్కాపాతంతో!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెప్పులు ఇటాలియన్ డిజైనర్ ఆంటోనియో వియెట్రి రూపొందించారు. దుబాయ్‌లో MIDE ఫ్యాషన్ వీక్‌లో భాగంగా ఆవిష్కరించిన ఈ మహిళల హై-హీల్డ్ షూలకు 180 కోట్ల రూపాయల విలువ ఉంది. వీటి మడమల భాగంలో బంగారం, 30 క్యారెట్ల వజ్రాలు, అర్జెంటీనా నాటి ఉల్కాపాతం ముక్కలు పొదిగి ఉన్నాయి. వీటిని 'మూన్ స్టార్ షూస్'గా పిలుస్తారు. గతంలో ఆంటోనియో 24 క్యారెట్ల బంగారంతో చేసిన బూట్లను కూడా రూపొందించారు.

సంబంధిత పోస్ట్