వైద్యురాలిపై అత్యాచారం-హత్య జరిగిన కోల్‌కతా ఆసుపత్రిని ధ్వంసం చేసిన కేసులో 19 మంది అరెస్టు

వైద్యురాలిపై అత్యాచారం-హత్య జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ & ఆసుపత్రిని ధ్వంసం చేసినందుకు ఇప్పటివరకు 19 మందిని అరెస్టు చేశామని కోల్‌కతా పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని సోషల్ మీడియా ద్వారా గుర్తించామని చెప్పారు. ఆస్పత్రి ఆవరణలో అర్ధరాత్రి చేపట్టిన నిరసన సమయంలో కొందరు ఈ ఘటనకు పాల్పడ్డారు. అంతకుముందు, ఆస్పత్రి విధ్వంసం ఘటన ప్రతిపక్ష పార్టీల పనేనని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్