BMW వంటి దిగ్గజ సంస్థలో 19 ఏళ్ల గౌరీ ఎమ్ అనే యువతి డిగ్రీ లేకుండానే పర్సనల్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమెకు లింక్డ్‌ఇన్‌లో 65,000 మందికి పైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 35 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. కంపెనీ ప్రతినిధులే ఆమెను సంప్రదించి ఉద్యోగం ఆఫర్ చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కొందరు ఆమె నైపుణ్యాన్ని, పర్సనల్ బ్రాండింగ్‌ను ప్రశంసిస్తుండగా, మరికొందరు డిగ్రీ ప్రాముఖ్యతను తగ్గించకూడదని సూచిస్తున్నారు.