ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ చాట్‌జీపీటీకి ఊహించని షాక్ తగిలింది. అమెరికా రక్షణ శాఖతో ఓపెన్ ఏఐ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందంతో 25 లక్షల మంది యూజర్లు చాట్‌జీపీటీని బాయ్‌కాట్ చేశారు. ఏఐ సాంకేతికతను మిలిటరీ అవసరాలకు, నిఘా పనులకు ఉపయోగించడం నైతిక విలువలకే విరుద్ధమని వినియోగదారులు భావిస్తున్నారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా 'క్విట్ చాట్ జీపీటీ' అనే ఉద్యమం సోషల్ మీడియాలో మొదలైంది.