లక్ష డాలర్లు చెల్లించి అమెరికా హెచ్-1బీ వీసా తీసుకునేందుకు 2026 ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల మందికిపైగా దరఖాస్తుదారులు ముందుకొచ్చారని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ’ కార్యదర్శి మార్క్‌వేన్ ముల్లిన్ తెలిపారు. మొత్తంగా సుమారు 2.86 లక్షల హెచ్-1బీ దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. లక్ష డాలర్లు చెల్లించిన దరఖాస్తుల ప్రక్రియ 15 రోజుల్లో పూర్తవుతుందని, ఇతర దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు సుమారు 7.5 నెలల సమయం పడుతుందని చెప్పారు.