ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రారంభమైన తర్వాత రెండు దేశాల్లో కలిపి సుమారు 20 లక్షల మంది మరణించినట్లు ‘సెంటర్ ఫర్ స్ట్రాటిజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS)’ నివేదిక వెల్లడించింది. ఉక్రెయిన్ ప్రతిదాడుల్లో రష్యాలో కనీసం 12 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, అందులో 3.25 లక్షల మంది సైనికులని పేర్కొంది. ఉక్రెయిన్ బలగాల్లో 1.4 లక్షల మంది సైనికులు మరణించగా, గాయాలు, గల్లంతు, బందీలుగా తరలింపుల కేటగిరీలో మరో 6 లక్షల మంది ఉన్నట్లు తెలిపింది.