శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

AP: తిరుమలలో ఆదివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో శిలాతోరణం క్యూలైన్‌ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న (శనివారం) శ్రీవారిని 82,181 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,633 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.94 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕