AP: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం పెరిగింది. స్వామివారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి భక్తులు శిలాతోరణం వరకు క్యూలైనులో వేచి ఉన్నారు. గురువారం శ్రీవారిని 63,473 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,796 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి హుండీ ఆదాయం రూ.4.54 కోట్లు వచ్చిందని TTD అధికారులు తెలిపారు.