యెమెన్‌లోని తైజ్ ప్రావిన్సులో రద్దీగా ఉండే హల్ అదారా మార్కెట్‌పై జరిగిన దాడిలో 20 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హూతీ తిరుగుబాటు వర్గం తెలిపింది. ఈ దాడికి సౌదీ అరేబియా కారణమని ఆరోపించింది. అయితే, వైమానిక దాడులు జరగలేదని, హూతీలే క్షిపణులతో దాడులకు పాల్పడ్డారని తైజ్ అధికారులు ఆరోపించారు. ఘటనపై ఇరువర్గాల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.