AP: శ్రీసత్యసాయి జిల్లా అగళి మండలం హనుమనపల్లిలో పెళ్లి విందు విషాదంగా మారింది. ఆదివారం ఉదయం వండిన అనుపకాయల సాంబారును అతిథులు పదేపదే తినడంతో అది విషతుల్యమైంది. దీనివల్ల సుమారు 20 మంది గ్రామస్థులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. బాధితులను అగళి ఆస్పత్రికి తరలించగా, జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ మంజువాణి వైద్య బృందంతో గ్రామానికి చేరుకుని చికిత్స అందించారు. వైద్య బృందం మూడు రోజులు గ్రామంలోనే ఉండి సేవలు అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే షోకాజ్ నోటీసులు ఇస్తామని అధికారులు ఆదేశించారు.