2025: తెలంగాణలో 199 అవినీతి కేసులు నమోదు

TG: 2025 సంవత్సరంలో అవినీతి అధికారులపై ACB పంజా విసిరింది. ఈ ఏడాది మొత్తం 199 కేసులు నమోదు చేసి 273 మంది నిందితులు అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీజీ చారు సిన్హా వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. 157 ట్రాప్ కేసుల్లో 224 మంది అరెస్ట్ అయ్యారని వీరిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. 15 అక్రమాస్తుల కేసుల్లో రూ.96.13 కోట్లు వెలికి తీశామని పేర్కొన్నారు. 115 మందిపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్