2029 ఎన్నికలే తన టార్గెట్ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నేతల పనితీరు బాగా లేకుంటే మొహమాటం లేకుండా గుడ్‌బై చెప్పేస్తానని హెచ్చరించారు. "వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కౌంట్‌డౌన్ పెట్టుకుని పనిచేస్తున్నాం. ఏళ్లు, నెలలు, రోజులు, గంటలు కూడా లెక్కిస్తున్నా. తానా, ఆటా అంటూ ఫారెన్ ట్రిప్పులు వద్దు. అలా వెళ్తే టాటా చెప్పేస్తా. ప్రజాప్రతినిధుల గ్రాఫ్ పరిశీలిస్తున్నా. నెల రోజులపాటు ప్రతి గడపకూ నేతలు వెళ్లాలి." అని సీఎం స్పష్టం చేశారు.